“యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి!” కీర్తన Psalm 92:5
ప్రభు నా దేవా నీ చేతి కార్యములను
ఆశ్చర్యముతో నే నెంచి చూడగన్
తారలజూచి గంభీర యురుములు వినగా
విశ్వమంత నీ శక్తిన్ కనుపరచన్
పల్లవి : నా ప్రాణమెంతో నిన్ను పాడును
గొప్ప దేవా గొప్ప దేవా
నా ప్రాణమెంతో నిన్ను పాడును
గొప్ప దేవా గొప్ప దేవా
1. అడవులందు నే సంచరించగను
పక్షుల మధుర సంగీతములు వినగా
పర్వత శోభ నే పరికించి చూడ
సెలయేరుల చల్లగాలి సోక
|| నా ప్రాణమెంతో ||
2. ప్రియసుతుని నా కొరకై చనిపోవ
పంపుట తలచి భరించ గలనా?
సిలువ పైని నా భారమంత మోసి
పాపము తీయ రక్తము కార్చెను
|| నా ప్రాణమెంతో ||
3. ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి
పర గృహమునకు నను గొనిపోయెడి వేళ
ఆనందముతో పూజించి ప్రకటింతు
ఓ నా దేవా నీవే ఘనుడవంచు
|| నా ప్రాణమెంతో ||