సిలువలో ఆ సిలువలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) 1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు (2) కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు 2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) దూషించి అపహసించి హింసించిరా నిన్ను … Read more

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు 1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ|| 2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||