పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా

“సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3 1. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా 2. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా 3. పరిశుద్ధ తనయుడా నరరూప ధారుడా నరులను రక్షించు కరుణా సముద్రా 4. పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా 5. జనక కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా

నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు

“దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించెదను” కీర్తన Psalm 66:16 1. నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు దయచే ప్రాయశ్చిత్తమైతివి నాదు రోజవు 2. సాతానుకు నే దాసుదనై నాశమొందగా నాతాను ద్వారా తెలిపితివి నాదు ప్రియుడా 3. వ్యాదిగ్రస్తుండనై హృదయక్షీణ మొందితిన్ బాధల నొంది తప్పియుంటి నాదు ప్రియుడా 4. తప్పిన రూక, పిల్లవాడు, గొఱ్ఱెవలెనే తప్పిన నన్ను వెదకి రక్షించితివి … Read more