కృపా సత్య సంపూర్ణుడా

కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2 నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా …  మహనీయుడవు నీవేనయా …  ఎర్రసముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా      దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2     ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2  నూతనక్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా      నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2     నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2 నైవేద్యములు, దహనబలులు నీ కోరవుగా      నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2     నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే -2  

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు యెడబాయని నీ కృపలో నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి 2 నిత్యములో నను నీ స్వాస్థ్యముగ 2 రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2 యెడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి 2 … Read more