యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్

నీవే యెహోవా నా కాపరివి

“నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23 పల్లవి : నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువ లేదిలలోన 1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి నా ప్రాణమునకు సేదను దీర్చి నన్ను నడుపుము నీతిమార్గమున || నీవే యెహోవా || 2. గాఢాంధకార లోయలయందు పడియుండి నేను సంచరించినను తోడైయుందువు నీ దుడ్డుకర్ర దండముతో నీ వాదరించెదవు || నీవే యెహోవా || … Read more