“క్రీస్తు మన కోసము శాపమై మనలను … శాపము నుండి విమోచించెను.” గలతీ Galatians 3:14
పల్లవి : నే స్తుతించెదను యేసు నామమును – భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని – నిత్యం నిత్యం నే స్తుతించెదను
1. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ – వర్ణింప నెవ్వరికి తరమౌనా?
పాపిని నన్ను రక్షించుటకై – చూపేను ప్రేమన పారముగా
|| నే స్తుతించెదను ||
2. పాపములన్నియు బాపుటకై – శాపములన్నియు మాపుటకై
ఏ పాపమెరుగని ఆ పావనుడు – శాపగ్రాహియై చావొందెను
|| నే స్తుతించెదను ||
3. శోధన కాలముల యందున – వేదన కాలముల యందున
నాధుడు యేసు మనతోడనుండ – అంతమేగా మన చింతలకు
|| నే స్తుతించెదను ||
4. ఎనలేని ప్రేమతో కౌగిలించెను – ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను
మహామహుండు మహిమ ప్రధానుడు – మహిమతో వచ్చును మేఘముపై
|| నే స్తుతించెదను ||
5. రాజాధిరాజు ప్రభు యేసే – దేవాదిదేవుడు మన యేసే
పరమందు దూతలు యిహమందు నరులు – పాడుడి ప్రభునకు హల్లెలూయా
|| నే స్తుతించెదను ||