ఇదిగో నీ రాజు వచ్చుచుండె

“నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.” జెకర్యా Zechariah 9:9

పల్లవి : ఇదిగో నీ రాజు వచ్చుచుండె
సీయోను కుమారి సంతోషించు
యేరూషలేం కుమారి ఉల్లసించు

1. నీదు రాజు నీతితో – దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు – వచ్చుచుండె
|| ఇదిగో ||

2. రక్షణ గలవాడుగా – అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యెరూషలేం – వచ్చుచుండె
|| ఇదిగో ||

3. సాత్వీకుండు యీ భువిన్ – అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై – వచ్చుచుండె
|| ఇదిగో ||

4. దీనపరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె
|| ఇదిగో ||

5. ఇలను గాడిద నెక్కియే – బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు – వచ్చుచుండె
|| ఇదిగో ||

6. దావీదు కుమారుడు – దేవుడు పాపులకు
జయ గీతములతో – వచ్చుచుండె
|| ఇదిగో ||

7. యేసుని ప్రేమించుచు – హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయా
|| ఇదిగో ||

Leave a Comment