“రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను.” కీర్తన Psalm 145
పల్లవి : ఓ నాదు యేసురాజా
నిన్ను నే నుతించెదను
అనుపల్లవి : నీనామమును సదా
నే సన్నుతించుచుందును
1. అనుదినము నిను స్తుతియించెదను
ఘనంబు చేయుచుందును నేను
|| ఓ నాదు ||
2. వర్ణించెద నే నీ క్రియలను
స్మరియించెద నీ మంచితనంబున్
|| ఓ నాదు ||
3. రక్షణ గీతము నే పాడెదను
నిశ్చయ జయధ్వని నే చేసెదను
|| ఓ నాదు ||
4. విజయ గీతము వినిపించెదను
భజియించెద జీవితమంతయును
|| ఓ నాదు ||
5. నిరీక్షణ పూర్ణతగలిగి
పరికించెద నా ప్రభు రాకడను
|| ఓ నాదు ||