“అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును” ఆదికాండము Genesis 15:1
పల్లవి : కృపాతిశయముల్ ఓ నా యెహోవా – నిత్యమున్ కీర్తింతును
తరతరములకు నీ విశ్వాస్యతన్ – తెలియ జేసెదను
1. యెహోవా వాక్కు దర్శనమందు – అబ్రామునకు వచ్చెను
అబ్రామా భయపడకు – 2
నీ కేడెమును – బహుమానము నేనై యున్నాననెను – 2
|| కృపాతిశయముల్ ||
2. నా నిబంధనన్ ఏ నాటికిన్
రద్దుపరచనని పల్కెన్ – మార్చవు నీ మాటను
నీ పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు
|| కృపాతిశయముల్ ||
3. శాశ్వతమైనదా ప్రభుత్వము – తొలగిపోదే నాటికిన్
లయము కాదు ఆ రాజ్యం
మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము
|| కృపాతిశయముల్ ||
4. నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి
ఆకాశ తారల వలెన్
సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి
|| కృపాతిశయముల్ ||
5. దివారాత్రులతో నా నిబంధన
మార్చెదరా మీరు మీరునట్లు – అట్లయిన భంగమగున్
దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి
|| కృపాతిశయముల్ ||
6. సింహాసనమున దావీదు – సంతతి యుండక మానదు
లేవీయుల్ యాజకులన్
నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి
|| కృపాతిశయముల్ ||
7. యెహోవా నీ కృప కార్యములన్నియు
వీనుల విందుగ నొప్పుచుండె
శ్లాఘింతున్ మనసారగన్
హల్లెలూయ – స్తోత్రములతో – కీర్తింతు నిత్యము
|| కృపాతిశయముల్ ||