కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2 నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా … మహనీయుడవు నీవేనయా …
- ఎర్రసముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2 ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2
- నూతనక్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2 నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2
- నైవేద్యములు, దహనబలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2 నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే -2