దూతగణములెల్ల ఆరాధించిరిగా

“వారు సైన్యములకధిపతియగు యెహోవా ― పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3

పల్లవి : దూతగణములెల్ల ఆరాధించిరిగా
పరిశుద్ధుడు సైన్యముల యెహోవని

అనుపల్లవి : ఇహపరములలో ఆయన మహిమ
నిండియున్నదని గానము చేసిరి – 2

1. నిష్కళంకమైనది నీ కనుదృష్టి
నీవు చూడలేవుగా దుష్టత్వమును
దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో
చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము
|| దూతగణము ||

2. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి
నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
పెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవా
ఘనముగాను పొగడెదను పావన ప్రభువా
|| దూతగణము ||

3. పాపముతో పతనమైన నా దేహమును
పరిశుద్ధాలయముగాని చేసికొంటివి
పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన
సర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను
|| దూతగణము ||

4. నీ రక్తముచేత నాకు కలిగించితివి
నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో
ప్రవేశింపజేసియున్న ప్రియ యేసువా
పూజించెద నిన్ను నాదు జీవితమంతా
|| దూతగణము ||

5. పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు
పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి
సమస్తమును చేయుటకు బలపరచితివి
సమాధాన కర్తనీకే వందన స్తుతులు
|| దూతగణము ||

Leave a Comment