“దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి” కీర్తన Psalm 139:17
పల్లవి : దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది
1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే – స్తుతి పాడెద హృదయముతో
స్తుతించి వర్ణించి ఘనపరతున్ – నీవే నా రక్షకుడవని
|| దేవా ||
2. మొదట నిన్ను యెరుగనైతిని – మొదటే నన్ను యెరిగితివి
వెదుకలేదు ప్రభువా నేను – వెదకితివి యీ పాపిని
|| దేవా ||
3. మరణమగు వూబిలో నుంటిని – కరుణ నిలిచె నన్ను రక్షింప
మరణము నుండి రక్షింప నన్ – నా ప్రభు బలియాయెను
|| దేవా ||
4. పాపలోకములో మునిగి యుంటిని – పాప శిక్షకు పాత్రుడను
యేసు ప్రభు సిలువ సహించెను – నాకు నూతన జీవ మొసగ
|| దేవా ||
5. అద్భుతమైనది సిలువ దృశ్యం – ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
ప్రభును వర్ణింప నశక్యము – ప్రభువే సహించె దుఃఖము
|| దేవా ||
6. యెట్లు మౌనముగా నుందు ప్రభూ – చెల్లింపక స్తోత్ర గీతము
కాలమంతా పాడుచుండెద – నీ ప్రేమ అపారమైనది
|| దేవా ||