యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు

“యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.” కీర్తన Psalm 145:8-16

యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు

పల్లవి : యెహోవా అందరికిని మహోపకారుండు
ఆయన కనికరమాయన పనులపై నున్నది

1. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు
నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక
|| యెహోవా ||

2. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు
నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు
|| యెహోవా ||

3. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు
నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును
|| యెహోవా ||

4. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును
కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును
|| యెహోవా ||

5. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు
|| యెహోవా ||

6. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి
ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు
|| యెహోవా ||

Leave a Comment