“యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక.” కీర్తన Psalm 149
పల్లవి : యెహోవాకు స్తుతులు పాడండి – మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు
1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు
|| యెహోవాకు ||
2. తంబురతోను సితారాతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది – మీరు
|| యెహోవాకు ||
3. భక్తులు ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఉప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు
|| యెహోవాకు ||
4. అన్యజనులను శిక్షించుటకు
రాజులఁ గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనతయునిదే – మీరు
|| యెహోవాకు ||