“సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక.” కీర్తన Psalm 150:6
పల్లవి : యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే
ఇహమందు రక్షకా – మహిమంచి దాతవు
1. పాలకుడవు పరమందు – ఏలికవు యెల్లరికి
చాలినట్టి ప్రధానుండా – సకల యధికారులకును
రాజుల రాజు ప్రభువుల ప్రభువు – ధరపర లోకములకు
దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ
ǁ యెహోవా ||
2. పరమును విడచితివి – ధర కేతెంచితివి
ప్రాణమీవు బలిగానిచ్చి – మమ్మును రక్షించితివి
తిరిగి లేచి మాకు – కరుణ జీవమిచ్చితివి
విరివగు నీ ప్రేమ – నరులపై చూపితివి
ధర నీదే ఘనతయని – చరణముల పడుదుము
|| యెహోవా ||
3. సంఘమందు మహిమ నీకే – సకల యుగములకు
యుగమందు ప్రతిజీవి – యెహోవాయని యనున్
జగమంతటికి నీవు – నిజమైన ప్రభుడవు
ఆది యంతమై నీవు – అలరారుచున్నావు
యుగయుగములకు – ఘనమహిమ కలుగును
|| యెహోవా ||