యేసు ప్రభువే సాతాను బలమును జయించెను

“అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకు” హెబ్రీ Hebrews 2:14-15

పల్లవి : యేసు ప్రభువే సాతాను బలమును జయించెను (1)
అందరము (1) విజయగీతములు పాడెదము (2)

1. దావీదుకు చిగురు నీవై
యూదా గోత్రపు సింహము నీవై
దేవా నీవే గ్రంథము విప్ప
జయమొందితివి నీకే స్తోత్రములు
|| యేసు ||

2. మన శ్రమలలో విజయము నిచ్చున్
తన రాజ్యమునందు మనలను చేర్చున్
ఘన విజయమును మనకై పొందెన్
ఘన విజయము యేసేయని హర్షించెదము
|| యేసు ||

3. మనలనెంతో ప్రేమించెను
తనయులముగ జయము పొందితిమి
సర్వములో విజయమిచ్చిన
సర్వేశ్వరుండా నీకే జయము
|| యేసు ||

4. మన మాయన సంఘముగా
తన రక్తము ద్వారా సమకూర్చెను
సంఘమునకు శిరస్సాయనే
సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము
|| యేసు ||

5. మహోన్నతుడు మహా ఘనుడు
మహిమరాజు మనకు విజయమునిచ్చె
మరణము గెల్చి తిరిగి లేచె
ఆర్భాటముతో మనము హర్షించెదము
|| యేసు ||

Leave a Comment