“మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక” 1 కొరింథీ Corinthians 15:57
పల్లవి : విజయుండు క్రీస్తు ప్రభావముతో
ఘనవిజయుండాయెను
సాతానుని తలను చితుక ద్రొక్కెను
సదా రాజ్యమేలును
1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ?
ఓ సమాధి నీ విజయమెక్కడ?
సిలువ శక్తితో విరుగగొట్టెను
విజయుండు సర్వంబులో
|| విజయుండు ||
2. యూదా గోత్రంపు సింహమాయనే
గ్రంథమును విప్ప యోగ్యుండు తానే
ఏడు ముద్రలను విప్పెడివాడు
యోగ్యుండు సర్వమందు
|| విజయుండు ||
3. ఆయనే శిరస్సు తన సంఘమునకు
మృతులలో నుండి ప్రథముడై లేచె
మన ప్రభుయేసే మరణమును గెల్చె
సర్వములో ప్రధానుడై
|| విజయుండు ||
4. సింహాసనమందు వున్న మన ప్రభువే
పద్మరాగముల మరకతముల బోలి
సూర్యకాంతివలె ప్రకాశించెను
జయమని పాడెదము
|| విజయుండు ||
5. ఆయన యెదుట సాగిలపడి
నాలుగు జీవులు పెద్దలందరును
సర్వసృష్టికి దేవుండవని
ఆరాధించి మ్రొక్కిరి
|| విజయుండు ||
6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు
విజయమునిచ్చె తన ద్వారా మనకు
అధిక విజయము మనకిచ్చు ప్రభువే
అందరిలో అతిశ్రేష్టుండు
|| విజయుండు ||