“సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.” కీర్తన Psalm 100:1-2
పల్లవి : సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు
1. తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప
బలియాయెన్ – శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
2. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు – విడిపించె నైగుప్తునుండి
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
3. మోషేకు తన సేవను నొసగె – యెహోషువా జయమును పొందె
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
4. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా – కొనె మిమ్ము తన రక్తముతో
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||
5. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము – నేడే వినుమాయన స్వరము
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట ఆయనను స్తుతియించుడి
|| సమస్త ||