“ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను” యోహాను John 4:24
పల్లవి : స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ
నా ముక్తి దాతకే
ఆత్మసత్యముతో – ఆరాధించెదన్
హృదయపూర్వక – కృతజ్ఞతలన్
సదా సర్వదా చెల్లింతున్ – 2
1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను
వర్ణించలేను నీ అపార ప్రేమను
ఘోరవేదన – సంకట శ్రమలన్
శపిత సిల్వపై క్రీస్తు సహించెను
తండ్రి చిత్తము నూ నెరవేర్చెను
|| స్తుతియూ ||
2. కీర్తించెదా నీదు అపారకరుణకై
పరమ పుత్రుండు వేదన నోర్చెను
అవమాన నిందలు – మోముపై ఉమ్మియూ
ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్
అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే)
|| స్తుతియూ ||
3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై
అంతులేని నీ గొప్ప ప్రేమకై
అనంత జీవము మహిమ నిరీక్షణ
నా జీవితమునకే ఆధారమాయె
క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ
|| స్తుతియూ ||