“యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 148, 150
1. హల్లెలూయ యేసు ప్రభున్ – యెల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను – తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు – బలవంతున్ స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు – యేసుని స్తుతియించుడి
పల్లవి : రాజుల రాజైన యేసు రాజు – భూజనులనేలున్
హల్లెలూయ హల్లెలూయ – దేవుని స్తుతియించుడి
2. తంబురతోను వీణతోను – ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో – తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళములన్ – మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని – యేసుని స్తుతియించుడి
|| రాజుల రాజైన ||
3. సూర్య చంద్రులారా ఇల – దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన – యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లారా మీరు – కర్తను స్తుతియించుడి
హృదయమును ఒప్పించిన – నాథుని స్తుతియించుడి
|| రాజుల రాజైన ||
4. యువకులారా పిల్లలారా – దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై – సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా – యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై – అర్పించి స్తుతియించుడి
|| రాజుల రాజైన ||
5. అగాధమైన జలములారా – దేవుని స్తుతియించుడి
అలల వలె సేవకులు – లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా – దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు – ఎల్లరు స్తుతియించుడి
|| రాజుల రాజైన ||