“నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” కీర్తన Psalm 146
పల్లవి : హల్లెలూయ నా ప్రాణమా – యెహోవాను స్తుతించు
1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను
నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును
|| హల్లెలూయ ||
2. రాజుల చేతనైనను – మరి నరుల చేతనైనను
రక్షణ్య భాగ్యము కల్గదు – వారిని నమ్ముకొనకండి
|| హల్లెలూయ ||
3. వారి ప్రాణము నశియించును – వారు మంటిలో గలసెదరు
వారి సంకల్పములన్నియు నీ దినమే నాశనము నొందున్
|| హల్లెలూయ ||
4. యాకోబు దేవుండు – ఎవ్వనికి సాయంబగునో
యెవడెహోవా మీద ఆశపెట్టునో – వాడే ధన్యుడు
|| హల్లెలూయ ||
5. ఆకాశ భూమి సముద్రం – దానిలోని దంత సృజించెన్
ఆ తండ్రి యెన్నండైన తన మా-టలు తప్పనివాడు
|| హల్లెలూయ ||
6. బాధ నొందినవారికి – అతడే న్యాయము తీర్చున్
ఆకలిగొనినట్టి వారికి ఆ – హారము దయచేయున్
|| హల్లెలూయ ||
7. బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్
పుట్టంధుల కన్నులను యెహోవా తెరవజేసెడివాడు
|| హల్లెలూయ ||
8. క్రుంగినట్టి జనుల – నింగికెత్తెడు వాడాయనే
నీతిమంతుల నెల్లరిని యెహోవా ప్రేమించున్
|| హల్లెలూయ ||
9. పరదేశ వాసులను – కాపాడు వాడాయనే
వేరుదిక్కులేని వారిని విధవల నాదరించును
|| హల్లెలూయ ||
10. భక్తిహీనుల దారిని – వంకరగా జేయును
యెహోవాయే తరతరములు పరిపా – లించుచుండును
|| హల్లెలూయ ||
11. సీయోను నీ దేవుడు – తరతరములు రాజ్య మేలును
యెహోవాను స్తుతించుడి – హల్లెలూయా ఆమెన్
|| హల్లెలూయ ||