సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు

“యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు.” కీర్తన Psalm 126

పల్లవి : సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు
మనము కలలను కనిన వారివలె నుంటిమిగా

1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు
అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె
|| సీయోనుకు ||

2. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె
అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా
|| సీయోనుకు ||

3. ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు
మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి
|| సీయోనుకు ||

4. దక్షిణ దేశములో నదులు పారునట్లుగా
దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా
|| సీయోనుకు ||

5. పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు
పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు
|| సీయోనుకు ||

6. ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని
సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును
|| సీయోనుకు ||

 

Leave a Comment