“సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక.” నెహెమ్యా Nehemiah 9:5
పల్లవి : యేసు పరిశుద్ధ నామమునకు
యెప్పుడు అధిక స్తోత్రమే
1. ఇహపరమున – మేలైన నామము
శక్తి గల్గినట్టి – నామమిది – పరి
శుధ్ధులు స్తుతించు నామమిది – పరి
|| యేసు ||
2. సైతానున్ పాతాళ – మును జయించిన
వీరత్వము గల నామమిది – జయ
మొందెదము యీ నామమున – జయ
|| యేసు ||
3. నశించు పాపుల రక్షించ లోక
మునకేతెంచిన – నామమిది – పర
లోకమున జేర్చు నామమిది – పర
|| యేసు ||
4. ఉత్తమ భక్తులు – పొగడి స్తుతించు
ఉన్నత దేవుని – నామమిది – లోక
మంత ప్రకాశించె – నామమిది – లోక
|| యేసు ||
5. శోధన గాధల – కష్టసమయాన
ఓదార్చి నడుపు – నామమిది – ఆటం
కము తీసివేయు నామమిది – ఆటం
|| యేసు ||