ఓ జగద్రక్షకా విశ్వవిధాత

“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” రోమీయులకు Romans 8:32

పల్లవి : ఓ జగద్రక్షకా విశ్వవిధాత – రక్షణ నొసగితివి
సర్వకృపలకు దాతవు నీవే – బలియైతివి మాకై

1. కృపద్వారా రక్షణ మాకొసగె – విశ్వాసము ద్వారానే
అపాత్రులమైనట్టి మాకు – యిది నీ వరమేగా
|| ఓ జగద్రక్షకా ||

2. పాపములో మేము మరణించినప్పుడు – వచ్చితివి యిలకు
ప్రభువా మేము నీ చెంతనుండ – జీవము నిచ్చితివి
|| ఓ జగద్రక్షకా ||

3. పాపభారముచే పడిచెడియున్న – మమ్మును గాంచితివి
కృప ద్వారానే మమ్మును పిలిచి శాంతిని వొసగితివి
|| ఓ జగద్రక్షకా ||

4. రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము చేసితివి
రయముగ విశ్వసించిన మాకు ఆత్మను వొసగితివి
|| ఓ జగద్రక్షకా ||

5. మరుగైన వాటిని అజ్ఞానులకు బయలుపరచితివి
మర్మములను గ్రహియించుటకు జ్ఞానము నొసగితివి
|| ఓ జగద్రక్షకా ||

6. సేవను మాకు నిచ్చితివయ్యా యుగయుగముల వరకు
శక్తిమంతులమై నిను స్తుతియింప విజయము నొసగితివి
|| ఓ జగద్రక్షకా ||

Leave a Comment