Stotrinchi keertintumu
ghanaparachedamu koniyaadedamu
aadarinchi kaapaadu vaadu
eederchu vaadu
1. Mana kintha varaku sahaaya paden
thaanappaginchu kone manakai – manala
nadipenu sukhamuganu thanadu satyamu
nerpinchi – kanu paapaga kaache – aadarinchi… “Sto”
2. Ee dharaloni narulalo – yadhardha hrudayulaku
mudamuna thana chittamu thelupun
padilamuga prabhu kannulu
prudhivini parugeththu aa……… “Sto”
3. Anni samayamulalo kannulatho
bodhinchunu nannu maarchenu thappinan
pennuga hrudayamu naadarinche
anna guruvu yesu – aa………. “Sto”
4. Agni vanti kannulu – vighnamulanundi
vidipinchu – thagina sahaayamu cheyunu
ekkaala mandunu kunukavu……….
makkuva pillalaku – aa……….. “Sto”
5. Haagarunu choochina kannulu anekula
choochenu ishraayelula kanikarinche
ezraaku sahaaya paden
nidrinchavu neppudu – aa………. “Sto”
6. Neethimanthula jooche – daadibole
kaachen – jyotula vale nundunu
atti balamitchu avasaratan
ksheetininu viduvadu – aa………. “Sto”
7. Edu kannulu gala vaadu – naadu nedu
kaapaadunu – edathegani chedugula
baapun – redula nerparachu vaadu
paadudi Halleluyaa – aa………. “Sto”
స్తోత్రించి కీర్తింతుము – ఘనపరచెదము – కొనియాడెదము
ఆదరించి – కాపాడువాడు – ఈడేర్చువాడు
1. మనకింత వరకు సహాయపడెన్ – తానప్పగించుకొనే మనకై
మనల నడిపెను సుఖముగను
తనదు సత్యము నేర్పించి – కనుపాపగ కాచె ఆ …
|| స్తోత్రించి ||
2. ఈ ధరలోని నరులలో – యధార్థ హృదయులకు
ముదమున తనచిత్తము తెలుపున్
పదిలముగ ప్రభుకన్నులు – పృథివిని పరుగెత్తు ఆ …
|| స్తోత్రించి ||
3. అన్ని సమయములలో – కన్నులతో బోధించును
నన్ను మార్చెను తప్పినన్
పెన్నుగ హృదయము నాదరించె – అన్న గురుయేసు ఆ …
|| స్తోత్రించి ||
4. అగ్ని వంటి కన్నులు – విఘ్నముల నుండి విడిపించు
తగిన సహాయము చేయును
ఎక్కాలమందును కునుకవు – మక్కువ పిల్లలకు ఆ …
|| స్తోత్రించి ||
5. హాగరును చూచిన కన్నులు – అనేకుల చూచెను
ఇశ్రాయేలుల కనికరించె
ఎజ్రాకు సహాయపడెన్ – నిద్రించవు నెపుడు ఆ …
|| స్తోత్రించి ||
6. నీతిమంతుల జూచె – దాదిబోలె కాచెన్
జ్యోతుల వలె నుండును
అతిబలమిచ్చు అవసరతన్ – క్షితినిను విడువడు ఆ …
|| స్తోత్రించి ||
7. ఏడు కన్నులు గలవాడు – నాడు నేడు కాపాడును
ఎడతెగని చెడుగుల బాపున్
రేడుల నేర్పరచు వాడు – పాడుడి హల్లెలూయా ఆ …
|| స్తోత్రించి ||