Nee rakhtame – nee rakhtame – nan shudheekarinchun
nee rakhtame naa balamu
1. Nee rakhta dharale yila – paapikashrayam bitchunu
parishuddha tandri paapini – kadigi pavithra parachunu
“Nee rakhtame”
2. Nashiyinchu variki nee siluva – verritanamuga nunnadi
rakhshimpa baduchunna paapiki – devuni shkhti yunnadi
“Nee rakhtame”
3. Nee silvalo kaarchinatti – viluvaina rakhtamuche
paapa vimukhti jesitivi – parishudda deva tanayudaa
“Nee rakhtame”
4. Pandivale porlina nannu – kukka vale tirigina nanu premato
jerchukontivi – prabhuva neeke sthotramu
“Nee rakhtame”
5. Nannu vembadinchu saitanun – nannu bedarinchu saitanun
dunumadedi nee rakhtame – dahinchedi nee rakhtame
“Nee rakhtame”
6. Sthuti mahima ghanatayu – yuga yugambulakunu
sthuti paathra neeke chellunu – sthotrarhuda neeke thagunu
“Nee rakhtame”
నీ రక్తమే – నీ రక్తమే – నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే – నా బలము
1. నీ రక్తధారలే యిల – పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచును
|| ప్రభుయేసు ||
2. నశించు వారికి నీ సిలువ – వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి – దేవుని శక్తియైయున్నద
|| ప్రభుయేసు ||
3. నీ సిల్వలో కార్చినట్టి – విలువైన రక్తముచే
పాప విముక్తిఁ జేసితివి – పరిశుద్ధ దేవ తనయుడ
|| ప్రభుయేసు ||
4. పందివలె పొర్లిన నన్ను – కుక్కవలె తిరిగిన నన్ను
ప్రేమతో జేర్చుకొంటివి – ప్రభువా నీ కే స్తోత్రము
|| ప్రభుయేసు ||
5. నన్ను వెంబడించు సైతానున్ – నన్ను బెదరించు సైతానున్
దునుమాడేది నీ రక్తమే – దహించేది నీ రక్తమే
|| ప్రభుయేసు ||
6. స్తుతి మహిమ ఘనతయు – యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును – స్తోత్రార్హుడ నీకే తగును
|| ప్రభుయేసు ||