Boora shabhdambu ningin dwanimpa gaanchedamesun
maa eduta orputho memu vechi yuntimi
nidrinche vaaru nilathurilan
Pallavi : Praana priyudaa – praana priyudaa
rammu maa Yesu – paadedamu – Halleluya –
entho santosham yegiripoyedam – paatalatho
2. Bhaktulakai vachchu thaskarivale – shuddulu maatrame
maaredaru dootalu ningin ekamai koodi paatatho
boora dwaninthuru
3. Vekuva chukka kaantiniboli – soundharyamaina
maadhuryudu paralokamandu hetchainavaadu –
naa korakai shrama sahinchenu
4. Reppapaatutho shuddhulu lechi marugai podu –
raayanatho nundan madhura gumpu meghamu cheri –
sandhincheda mesunatchchata
5. Paramandu shuddhul makutamul bonda dootalu
kaachi nilchu dinam sangha vadhuvu dhavala
vastrambu dharinchi ghanatha nonde dinam
6. Halleluyaa – aanandinchedam Halleluyaa –
aarbhatinthum Halleluyaa – dhanyulaithimi –
Halleluyaa – aamen aamen
“ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.” 1 థెస్స Thessalonians 4:17
బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట
ఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించే వారు నిలతురిలన్
పల్లవి : ప్రాణప్రియుడా – ప్రాణప్రియుడా
రమ్ము మా యేసు – పాడెదము – హల్లెలూయ – ఎంతో సంతోషం
ఎగిరి పోయెదం – పాటలతో
1. భక్తులకై వచ్చు తస్కరివలె – శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమైకూడి – పాటతో బూర ధ్వనింతురు
|| ప్రాణప్రియుడా ||
2. వేకువ చుక్క కాంతినిబోలి – సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు – నాకొరకై శ్రమ సహించెను
|| ప్రాణప్రియుడా ||
3. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
మధుర గుంపు మేఘము చేరి – సంధించెద మే – సునచ్చట
|| ప్రాణప్రియుడా ||
4.పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద
దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు
ధరించి ఘనతనొందే దినం
|| ప్రాణప్రియుడా ||
5. హల్లెలూయా – ఆనందించెదం హల్లెలూయా – ఆర్భటింతుం
హల్లెలూయా – ధన్యులైతిమి – హల్లెలూయా – ఆమెన్ ఆమెన్
|| ప్రాణప్రియుడా ||