నా వేదనలో వెదకితిని శ్రీయేసుని

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై 1. వేకు జాములో విలపించితిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2) 2. నీ హస్తములో నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)

ఆనందం యేసుతో ఆనందం

Aanandam yesutho aanandamu – ఆనందం యేసుతో ఆనందం ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను జయరాజాధిరాజుతో సాగెదను 1. నా ప్రాణమునకు సేదదీర్చి తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను ఏ అపాయమునకు నేను భయపడకుందును 2. నా ప్రభుని కృప చూచిన నాటినుండి నన్ను నేనే మరచిపోతినే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా 3. సిలువను యేసు సహించెను తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై అవమానము నొందె – నాకై మరణము గెలిచె