సిలువలో సాగింది యాత్ర

సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర ||2||

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||

పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో ||2||
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి ||2||
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి||

వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు ||2||
గేలి చేసినారు పరిహాసమాడినారు ||2||
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి||

సిలువలో ఆ సిలువలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)

1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు

2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా

3. నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను

సిలువ చెంత చేరిననాడు

పల్లవి:
సిలువ చెంత చేరిననాడు – కలుషములను కడిగివేయు

పౌలు వలెను సీల వలెను – సిద్ధపడిన భక్తుల జూచి
…సిలువ…

1.
కొండవంటి బండవంటి – మొండి హృదయంబు మండించు

పండియున్న పాపులనైన – పిలుచుచుండె పరము చేర
…సిలువ…

2.
వంద గొఱ్ఱెల మంద నుండి – ఒకటి తప్పి ఒంటరియాయె

తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి – ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్
…సిలువ…

3.
తప్పిపొయిన కుమారుండు – తండ్రిని విడచి తరలిపొయె

తప్పు తెలిసి తిరిగిరాగా – తండ్రి యతని చేర్చుకొనెను
…సిలువ…

4.
పాపి రావా పాపము విడచి – పరిశుద్ధు విందులొ చేర

పాపుల గతిని పరికించితివా – పాతాళంబే వారి యంతము
…సిలువ…

శిరము మీద ముళ్ల సాక్షిగా

శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ల సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా (2)
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు (3)
సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని (2)

మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం అవశ్యం
తద్ రక్తం పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం
ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ ||శిరము||

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
వృషభో రోర వీతి మహో దేవో
మద్యామ్ ఆవివేశత్తిథి
బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||

యేసు చావొందె సిలువపై

పల్లవి: యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే

1. నదివలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె – ఆ ప్రశస్త రక్తమే

2. నేడే నీ పాపము లొప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో – క్రీస్తుయేసు రక్తములో

3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై – అంగీకరించు యేసుని