అనాదిలో నియమించబడిన

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె

మౌని యాయెను బలియాగమాయెను

తన రుధిరముతో నన్ను కొనెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై

శరీరధారి యాయెను సజీవయాగమాయెను

మరణమును గెలిచి లేచెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

కలువరిగిరిలో

కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా (2)

  1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
    ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)
    నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
    నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2)
                                                  ||కలువరిగిరిలో||
  2. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను
    ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)
    ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
    నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2)
                                                 ||కలువరిగిరిలో||