నా ప్రియుడా యెసయ్యా – హోసన్నా మినిస్ట్రీస్

నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ –

నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2
నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥

నీ వాక్కులన్ని వాగ్దానములై – నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2
నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥

ముందెన్నడూ నేను వెళ్ళనీ – నూతనమైన మార్గములన్నిటిలో 2
నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥

సర్వోన్నతుడా సర్వకృపానిధి – సర్వసంపదలు నీలోనే యున్నవి2
నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥

ఎగురుచున్నది విజయ పతాకం

ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును – 2

రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే
రక్తమే జయం – యేసు రక్తమే జయం

1. యేసునినామం ఉచ్చరింపగనే
సాతాను సైన్యము వణుకు చున్నది – 2
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే – 2

2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం – 2
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం – 2

3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా – 2
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే – 2

 

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”