షారోను వనములో పూసిన పుష్పమై

షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని

1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా !!షారోను!!

2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా – నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా !!షారోను!!

3. సాత్వికమైన పరిచర్యలు నీవి – సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా – ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా !!షారోను!!

రాజాధి రాజ రవి కోటి తేజ

రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2)        ||రాజాధి||


1.వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2)        ||రాజాధి||


2.ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2)        ||రాజాధి||


3.మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2)        ||రాజాధి||





సర్వయుగములలో సజీవుడవు

పల్లవి : సర్వయుగములలో సజీవుడవు
సరిపోల్చగలన  నీ సామర్ధ్యమును -
కొనియాడబడినది నీ దివ్య తేజం -
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య (2)

1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు -
శ్రమల సంకెళ్ళయినా శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు -
జగతిని జయించిన జయశీలుడా (2)
                                  || సర్వయుగములలో ||

2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు-
శృంగ ధ్వనులతో సైన్యము  నడిపించు వాడవు నీవు (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను -
మరణము గెలిచినా బహు ధీరుడ (2)
                               || సర్వయుగములలో ||


3.కృపాలతో రాజ్యమును స్థిరపరచు నీవు -
బహూత్తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో -
శత్రువు నణచినా బహు శూరుడా (2)
                              || సర్వయుగములలో ||

సర్వలోక నివాసులారా

    1. సర్వలోక నివాసులారా – సర్వాధికారిని కీర్తించెదము రారండి
    1. యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
    1. మన సంతోషము – పరిపూర్ణము చేయు
    1. శాంతి సదనములో నివసింతుము
  1. కరుణా కటాక్షము పాప విమోచన
    
    యేసయ్యలోనే ఉన్నవి
    
    విలువైన రక్షణ అలంకారముతో
    
    దేదీప్యమానమై ప్రకాశించెదము|| సర్వలోక ||
  2. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
    
    మన దేవుని సన్నిధిలో ఉన్నవి
    
    పరిశుద్ధమైన అలంకారముతో
    
    కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము|| సర్వలోక ||
  3. సమృద్ధి జీవము సమైక్య సునాదము
    
    జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
    
    మృదువైన అక్షయ అలంకారముతో
    
    సద్భక్తితో సాగిపోదము

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే           ||ఆశ్రయ||

లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2)        ||ఆశ్రయ||