దేవా నా ఆర్తధ్వని

దేవా నా ఆర్తధ్వని వినవా

నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా

  1. గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను – ఆనందమైనను నీవేగదా|| దేవా ||
  2. అంతరంగ సమరములో – ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర – తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను – ఆశ్రయమైనను – ఆరాధనైనను నీవేగదా|| దేవా ||

ప్రభువా నీ కలువరి త్యాగము

ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే”ప్రభువా”

1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2
లోకములోనుండి ననువేరు చేసినది – నీదయా సంకల్పమే – 2 “ప్రభువా”

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే – పరిశుద్ధాత్మను నాకొసగితివే – 2
శాశ్వత రాజ్యముకై నను నియమించినది – నీ అనాది సంకల్పమే – 2 “ప్రభువా”

3. సంపూర్ణునిగా నను మార్చుటకే – శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే – 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే – నీ నిత్యసంకల్పమే – 2″ప్రభువా”

సర్వాధికారివి సర్వజ్ఞుడవు

సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2||
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా ||2||


1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2||
ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును ||2||   ||సర్వాధి||


2. బలశౌర్యములుగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును ||2||   ||సర్వాధి||


3. సర్వజగద్రక్షకూడా – లోకరాజ్యపాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా ||2||
బలమైన నీ రాజ్యస్థాపనకై  నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును ||2||   ||సర్వాధి||

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు
అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు
యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?

నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే
సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకరములెన్నో చేసితివే
హల్లెలూయ  - ఉపకరములెన్నో చేసితివే 

నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే
నిత్యజీవము నే పొందుటకు - పునరుత్థానము నొందితివే
హల్లెలూయ - పునరుత్థానము నొందితివే 

నాకు ఐశ్వర్యము నిచ్చుటకే  - నీ మహిమైశ్వర్యము విడిచితివే
మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే
హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2||
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత||

1.సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు ||2||
నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2||
నా నోట మృదువైన మాటలు పలికించినావు ||శాశ్వత||

2.నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2||
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు||శాశ్వత||