కృపా కృపా సజీవులతో  నను నిలిపినది నీ కృపా

కృపా కృపా సజీవులతో  నను నిలిపినది నీ కృపా | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical


కృపా కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా (2)
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2)
కృపా సాగర మహోనాతమైన
నీ కృపా చాలుయా    || కృపా||

1. శాశ్వతమైన నీ ప్రేమతో
నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే
నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని (2)
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై
నీ కమనియ కాంతులను విరజిమ్మెనే (2)
నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే   || కృపా||

2. గాలితుఫానుల అలజడితో
గూడుచెదరిన గువ్వవలే
గమ్యమును చూపే నిను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)
నీ వాత్యల్యమే నవ వసంతము
నా జీవిత దినములు ఆద్యంతము (2)
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము  ||కృపా||

3. అత్యునతమైన కృపలతో
ఆత్మఫలము సంపదలతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ (2)
నా హృదయార్పణ నిను మురిపించని
నీ రుణాతిశయములను కీర్తించని (2)
ఈ నీరీక్షణ నాలో నేరవని   || కృపా||

 


 

Krupaa Krupaa Sajeevulatho
Nanu Nilipinadi Nee Krupaa (2)
Naa Shramadinamuna Naatho Nilichi
Nanu Oodarchina Navyakrupaa Needu Krupaa (2)
Krupaa Saagara Mahonaathamaina
Nee Krupaa Chaaluya || Krupaa ||

1. Shaashvathamaina Nee Prematho
Nanu Preminchina Sreekarudaa
Nammakamaina Nee Saakshinai Ne
Nee Divya Sannidhilo Nannodigiponi (2)
Nee Upadeshame Naalo Phalabarithamai
Nee Kamaniya Kaanthulanu Virajimmene (2)
Nee Mahimanu Prakatimpa Nanu Nilipene
|| Krupaa ||

2. Gaalithufaanula Alajaditho
Gooduchedarina Guvvavale
Gamyamunu Choopa Ninu Vedukonaga
Nee Prema Kaugililo Nannadarinchitivi (2)
Nee Vaathalyame Nava Vasanthamu
Naa Jeevitha Dinamulu Aadyanthamu (2)
Okka Kshanamaina Viduvani Premamruthamu
|| Krupaa ||

3. Athyunathamaina Krupalatho
Aathmaphalamu Sampadalatho
Atishreshtamaina Swaasthyamunu Pondi
Nee Prema Raajyamulo Harshinchuvela (2)
Naa Hrudayarpana Ninu Muripinchani
Nee Runatishayamulu Keerthinchani (2)
Ee Neerikshana Naalo Neravani
|| Krupaa ||

అతి సుందరుడవు యేసయ్య

అతి సుందరుడవు యేసయ్య  | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical


అతి సుందరుడవు యేసయ్య …
మనోహరుడవు నీవయ్యా…  (2)
యదార్థవంతుల సభలో పరిశుద్ధులుతో కలిసి
నిన్ను ఆరాధించెను   (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా – హోసన్నా ఆరాధన

1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు  (2)
నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను – (2)
పరవశించి పరవళ్లు త్రొక్కి ఆరాధించెదను – (2)
||అతిసుందరుడవు||

2. అమూల్యమైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి యున్నావు   (2)
విశ్వాసముతో ఓర్పు గలిగి వాగ్దానమును పొందెదను – (2)
సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను  – (2)
||అతిసుందరుడవు||

3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు
పునాదులు గల పట్టణము కట్టుచున్నావు   (2)
సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుచున్నావు  – (2)
నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను  – (2)
||అతిసుందరుడవు||

ఆరాధనకు నీవే యోగ్యుడవు –
స్తుతులకు నీవే పాత్రుడవు  (2)
అతి సుందరుడా – మనోహరుడా  (2)
||అతిసుందరుడవు||

 


 

Athi Sundarudavu Yesuayya
Manoharudavu Neevayya… (2)
Yadarthavantula Sabhalo Parisuddhulutho Kalsi
Ninnu Aaradhinchenu (2)
Hallelujah Hallelujah
Hallelujah – Hosanna Aaradhana

1. Nee Sannidhilo Sampoornamaina Santoshamu Kaladu
Kripaa Kshemamulu Nee Mandiramulo Samruddhiga Kalavu (2)
Nenu Deenudani Nee Sannidhini Anubhavinchenu – (2)
Paravashinchi Paravallu Trokki Aaradhinchenu – (2)
||Athi Sundarudavu||

2. Amoolyamaina Vaagdhaanamulu Naakai Anugrahinchavu
Athyadhikamuga Aashirvadinchi Hechchinchi Unnavu (2)
Vishwasamutho Oorpu Galigi Vaagdhaanamunu Pondenu – (2)
Sampoornathakai Parisuddhudanai Aaradhinchenu – (2)
||Athi Sundarudavu||

3. Maharajuvai Siyonulo Eluchunnavu
Punaadulu Gala Pattanamu Kattuchunnavu (2)
Soundaryamu Gala Siyonulo Prakashinchuchunnavu – (2)
Nee Mahimanu Pondi Nee Dari Cheri Aaradhinchenu – (2)
||Athi Sundarudavu||

Aaradhanaku Neeve Yogyudavu –
Stuthulaku Neeve Patrudavu (2)
Athi Sundarudaa – Manoharudaa (2)
||Athi Sundarudavu||