కృపగల దేవా దయగల రాజా

కృపగల దేవా దయగల రాజా | Hosanna ministries 31rd Volume 2021 Song Lyrical

నా హృదయ సారధి  Album – 2021

కృపగల దేవా దయగల రాజా
చేరితి నిన్నే బహు ఘనతేగా
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని (2)
సర్వాధికారి నీవే దేవా
నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి
ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2)
||కృపగల||

1. త్రోవను చూపే తారవు నీవే
గమ్యము చేర్చే సారథి నీవే (2)
జీవన యాత్రా శుభప్రదమాయే
నా ప్రతి ప్రార్థన పరిమళమాయె
నీ ఉదయకాంతిలో నను నడుపుము –
నా హృదిని నీ శాంతితో నింపుము (2)
||కృపగల||

2. కృప చూపి నన్ను అభిషేకించి
వాగ్ధానములు నెరవేర్చినావే (2)
బహు వింతగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును –
నీ దివ్య మహిమలను ప్రకటింతును (2)
||కృపగల||

3. నా యేసురాజా వరుడైన దేవా
మేఘాల మీద దిగి వచ్చు వేళ (2)
ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో
ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో –
జీవింతు నీలోనే యుగయుగములు (2)
||కృపగల||

 


Krupagala Devaa Dayagala Raajaa | Hosanna ministries 31rd Volume 2021 Song Lyrical in English

Naa Hrudaya Saradhi Album – 2021

 

Pallavi
Krupagala Devaa Dayagala Raajaa
Cheriti Ninne Bahu Ghanategaa
Nee Charanamule Ne Koritini
Nee Varamulane Ne Vedhitini (2)
Sarvadhikaari Neeve Devaa
Naa Sahakaari Neeve Prabhuvaa
Naa Korikaleni Safalamu Chesii
Aalochanaleni Neraverchitivi
Arpinchedanu Naa Sarvamu Neeke Devaa
Aaradhinchi Aanandinchada Neelo Devaa (2)
||Krupagala||

Charanam 1
Trovanu Chope Taaravu Neeve
Gamyamu Cherche Saarathi Neeve (2)
Jeevana Yaatraa Shubhapradamaaye
Naa Prati Prardhana Parimalamaaye
Nee Udayakaanthilo Nanu Nadupumu
Naa Hridayini Nee Shaanthito Nimpumu (2)
||Krupagala||

Charanam 2
Krupa Choopi Nannu Abhishekinchi
Vaagdhaanamulu Neraverchinave (2)
Bahu Vintaga Nannu Preminchinave
Balamaaina Janamuga Nannu Maarchinave
Nee Keerthi Jagamantha Vivarinthunu
Nee Divya Mahimalanu Prakatinthunu (2)
||Krupagala||

Charanam 3
Naa Yesu Raajaa Varudaina Devaa
Meghaala Meeda Degi Vachhu Vela (2)
Aakaasha Vidhilo Kamaneeya Kaantilo
Priyamaina Sanghamai Ninu Cheredanu
Nilichedanu Neetone Siyonulo
Jeevintu Neelone Yugayugamulu (2)
||Krupagala||

నాలో ఏమి చూచి నీవు

నాలో ఏమి చూచి నీవు  | Hosanna Ministries New Song 2023


Lyrics: Telugu

నాలో ఏమి చూచి నీవు
ఇంత ప్రేమ చూపినావు (2)
మర్త్యమైన లోకమందు
నిత్యమైన కృపను చూపి
నేటి వరకు తోడుండినావు
యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)

1. నా తల్లి గర్భమునే నను కోరితివి
విశ్వాస గృహములో నన్నుచేర్చితివి (2)
అమృత జలమైన నీ నోటి మాటలతో
నిఖిల జగతికి నన్ను పంపినావు
ప్రకటింప నీ చరితం –
నాజన్మ నిజ ఫలితం (2)    || నాలో ఏమి  ||

2. ఘనులైన వారే నీ యెదుట నున్నను
బలమైన వారే ఎందరో ఉన్నను (2)
కన్నీళ్ల కడలిలో శ్రమల సుడులలో
నా స్థితి చూచి నన్ను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా –
కడవరకు నీ సాక్షిగా (2)  || నాలో ఏమి  ||

3. ప్రేమానురాగం నీ సంస్కృతియే
కరుణాకటాక్షము నీ గుణసంపదయే (2)
నలిగినా రెల్లును విరువనివాడ
చితికిన బ్రతుకును విడువనివాడ
నా పైన నీకెందుకో –
ఈ తగని వాత్సల్యము (2) || నాలో ఏమి  ||

4. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు
వర్ణనకందని అతిసుందరుడవు (2)
ఇరువది నలుగురు పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో సింహాసనముపై
ఆసీనుడా యేసయ్య –
నా స్తుతి నీకేనయ్యా (2)  || నాలో ఏమి  ||

 


Naalo Emi Choochi Neevu | Hosanna Ministries New Song 2023

Lyrics: English

Naalo Emi Choochi Neevu
Intha Prema Choopinavu (2)
Martyamaina Lokamandu
Nithyamaina Krupanu Choopi
Neti Varaku Thodundinavu
Yesayya Yesayya Naa Yesayya (2)
|| Naalo Emi ||

1. Naa Thalli Garbhamune Nanu Koritivi
Vishwasa Gruhamulo Nannu Cherchitivi (2)
Amruta Jalaina Nee Noti Maatalatho
Nikhila Jagatiki Nannu Pampinavu
Prakatimpa Nee Charitham –
Na Janma Nija Phalitham (2)
|| Naalo Emi ||

2. Ghanulaina Vaare Nee Yedhuta Nunnanu
Balamaina Vaare Endharo Unnanu (2)
Kanneela Kadalilo Shramala Sudululo
Naa Sthithi Choochi Nannu Cheradeesi
Marchitivi Nee Patrikaga –
Kadavaraku Nee Saakshiga (2)
|| Naalo Emi ||

3. Premaanuragam Nee Samskruthiye
Karuna Katakshamu Nee Gunasampadaye (2)
Naligina Rellunu Viruvanivada
Chitikina Brathukunu Viduvanivada
Naa Paina Neekenduko –
Ee Thagani Vaathsalayamu (2)
|| Naalo Emi ||

4. Dhavalavarnudavu Ratnavarnudavu
Varnanakandani Atisundarudavu (2)
Iruvadhi Naluguru Peddala Madhyalo
Mahima Prabhavamutho Simhasanamupai
Aaseenuda Yesayya –
Naa Stuthi Neekenayya (2)
|| Naalo Emi ||