నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2||

నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2||

1. ఆధారణలేని  లోకములో
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2||
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే  మేలాయెనే ||2||  || నా అర్పణలు ||

2. గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే ||2||
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేలాయెనే ||2||  || నా అర్పణలు ||

3. మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే ||2||
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోనుధ్యానమే నాకు మేలాయెను ||2||  || నా అర్పణలు ||

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము (2)

పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)
ఆప్యాయతకు నోచుకొనని
నను చేరదీసిన కృపా సాగరా (2)        ||చూచుచున్న||

అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)
అగ్ని వంటి శోధనలను
తప్పించితివే దయా సాగరా (2)          ||చూచుచున్న||

ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను


1.స్వార్థ ప్రియులు కాన రానీ వెయ్యేళ్ళ పాలనలో 
స్వస్థ బుద్ధి గల వారే పరిపాలించే రాజ్యమది (2)
స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును 
చిత్త శుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది (2) 

                                                           " ఎన్నెన్నో " 

2.భూనివాసులందరి లో గొర్రె పిల్ల రక్తము తో 
కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది (2) 
క్రీస్తు యేసు మూల రాయి యై 
అమూల్యమైన రాళ్ళమై 
ఆయనపై అమర్చబడుతూ వృద్ధినొందుచు సాగెదము (2)

                                                        " ఎన్నెన్నో" 

ఉత్సాహ గానము చేసెదము

ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)         ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)           ||హల్లెలూయ||

పరుగెత్తెదా పరుగెత్తెదా

పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)
అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)
అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)
వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||