ఎవరూ సమీపించలేని

ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)

ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2)         ||ఏమౌదునో||

పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)         ||ఏమౌదునో||

జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2)         ||ఏమౌదునో||

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 
  • ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే  నీదరి చేర్చితివే } 2 
    హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } 2|| నీవుగాక ||
  • అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే } 2
     స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2

నిన్న నేడు నిరంతరం మారనే మారవు

నిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)
నీవే నీవే నమ్మదగినా దేవుడవు
నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)
విడువదే నన్నెల్లప్పుడూ కృప
విజయపథమున నడిపించెనే కృప (2)
విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు        ||నిన్న|| యేసయ్యా నీ కృపాతిశయము
ఆదరించెనే శాశ్వత జీవముకై (2)
మరువదే నన్నెల్లప్పుడూ కృప
మాణిక్య మణులను మరిపించేనే కృప (2)
మైమరచితినే నీ కృప తలంచినప్పుడు     ||నిన్న|| యేసయ్యా నీ మహిమైశ్వర్యము
చూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)
ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప
శాంతి సమరము చేసెనే కృప (2)
మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే      ||నిన్న||

నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో

  నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో 
   నా జీవితం - పరిమళించెనే

1. ఒంటరిగువ్వనై - విలపించు సమయాన 
    ఓదర్చువారే - కానరారైరి
    ఔరా ! నీచాటు నన్ను దాచినందున -  నీకే నా స్తోత్రర్పణలు    | నా యేసయ్య | 

2. పూర్ణమనసుతో - పరిపూర్ణ ఆత్మతో 
    పూర్ణబలముతో - ఆదరించెద 
    నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య |

3. జయించిన నీవు - నా పక్షమైయుండగా 
    జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా 
    జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పణలు       | నా యేసయ్య |

ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం

పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పాపములన్నియు కడుగుచున్నది
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది

1. దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు

|| ప్రవహించుచున్నది ||

2. దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం నీకనుగ్రహించును
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు

|| ప్రవహించుచున్నది ||

3. జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు

|| ప్రవహించుచున్నది ||