యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2

  1. పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై
    నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2
    పూజ్యనీయుడా నీతి సూర్యుడా
    నిత్యము నాకనుల మెదలుచున్న వాడా   “యేసయ్యా”
  2. ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో
    మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2
    విజయశీలుడా – పరిశుద్ధాత్ముడా
    నిత్యము నాలోనే నిలిచియున్నవాడా – 2   “యేసయ్యా”

నేనెందుకని నీ సొత్తుగా మారితిని

నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ

నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును            “నేనె”

నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే
నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును              “నేనె”

నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును               ” నేనె”

భూమ్యాకాశములు సృజించిన

భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం (2)
నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2)
హల్లెలూయ లూయ హల్లెలూయా (4)

బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2)       ॥భూమ్యాకాశములు॥

జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2)       ॥భూమ్యాకాశములు॥

భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2)       ॥భూమ్యాకాశములు॥

నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2)       ॥భూమ్యాకాశములు॥

యూదా స్తుతి గోత్రపు సింహమా

యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
నీవే కదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా

నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు
అసాద్యమైనది ఏమున్నది

నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు
అసాద్యమైనది ఏమున్నది

నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు
అసాద్యమైనది ఏమున్నది

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2)
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2)

1. నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2)
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2)
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2)

2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2)
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2)

3. పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2)
శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2)
నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2)