నా మార్గమునకు దీపమైన

నా మార్గమునకు దీపమైన
నా యేసుతో సదా సాగెద

  1. గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2
    ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
    ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ ||
  2. నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2
    నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
    నిరీక్షణతో నే సాగెదను } 2|| నా మార్గ ||
  3. సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2
    నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
    నా దేవునితో సాగెదను } 2|| నా మార్గ ||
  4. ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
    పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
    ప్రియుని ముఖము చూచి సాగెదను

నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు

పల్లవి || నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము

1. ఆరని దీపమై దేదీవ్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై
చేసావు పండగ – వేలిగావు నిండుగా

|| నా దీపము ||

2. మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది
మ్రోగిన్చుచున్నది – ప్రతిచోట సాక్షిగా

|| నా దీపము ||

3.ఆగని హోరులో ఆరిన నేలపై
నాముందు వెలసితివే  సైన్యములకదిపతివై
పరాక్రమ శాలివై – నడిచావు కాపరిగా
|| నా దీపము ||

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు 

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని||

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని||

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)       ||అగ్ని||

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)       ||అగ్ని||

నా విమోచకుడా యేసయ్యా

నా విమోచకుడా యేసయ్యా

నీ జీవన రాగాలలో….
నీ నామమే ప్రతిధ్వనించెనే
నీ జీవన రాగాలలో….
నీ నామమే ప్రతిధ్వనించెనే
నా విమోచకుడా యేసయ్యా….

1. నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
నీవు చూపిన నీ కృప నే మరువలేను ||2||    ||నా విమోచకుడా||

2. జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గమలో నడిపించి నందునా ||2||
జీవాధిపతి నిన్ను నే విడువలేను ||2||     ||నా విమోచకుడా||

3. మమతలూరించె వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
నిన్ను స్తుతించకుండా నే నుండలేను ||2||   ||నా విమోచకుడా||

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు||

రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||

 

రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||


సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||