నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2)
నాకెంతో ఆనందం…

ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక (2)
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో||

నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2)
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) ||నాకెంతో||

నూతన యెరూషలేం నా గమ్యమేనని
నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2)
నీవుండు స్థలములో నేనుండ గోరెదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) ||నాకెంతో||

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా 

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)         ||యేసయ్యా||

నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే          ||యేసయ్యా||

నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే          ||యేసయ్యా||

నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే          ||యేసయ్యా||

యేసయ్యా నీ కృపా

యేసయ్యా నీ కృపా – నను అమరత్వానికి

అర్హునిగా మార్చెను – యేసయ్యా నీ కృపా

|| యేసయ్యా ||

 

1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా – నీ శాశ్వత కృపతో నింపితివా

నీ సన్నిధిలో దీనుడనై – కాచుకొనెద నీ కృప ఎన్నడు

|| యేసయ్యా ||

 

2.నీ నిత్య మహిమకు పిలిచితివా – నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా

ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన – ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును

|| యేసయ్యా ||

 

3.గువ్వవలె నే నెరిగి నిను చేరనా – నీ కౌగిటనే నొదిగి హర్షించనా

ఈ కోరిక నాలో తీరునా ? – రాకడలోనే తీరును

|| యేసయ్యా ||

 ప్రేమామృతం నీ సన్నిధి

ప్రేమామృతం నీ సన్నిధి
నిత్యము నాపెన్నిధి ||2||

1. నీ కృప నన్నాదరించెనులే
భీకర తుపాను సుడిగాలిలో ||2||
కరములు చాచి ననుచేరదీసి
పరిశుద్ధుడా నీ బసచేర్చినావు ||2||  || ప్రేమామృతం ||

2. కమ్మని వెలుగై నీవున్నావులే
చిమ్మచీకటి కెరటాలతో ||2||
చీకటి తెరలు ఛేదించినావు
నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ||2||  || ప్రేమామృతం ||

యేసు రక్తము రక్తము రక్తము 

యేసు రక్తము రక్తము రక్తము (2)
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము       ||యేసు రక్తము||

ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2)      ||యేసు రక్తము||

మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను (2)      ||యేసు రక్తము||

మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను (2)      ||యేసు రక్తము||