ఆర్భాటముతో ప్రధాన దూత

ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో

మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు

1.అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము

అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు

ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే

2.పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము

సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు

గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము

3.వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము

ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో

యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము

నిండు మనసుతో నిన్నే

నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం

మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం

మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట


1.నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను

దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు

అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య


2.నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని

నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి

నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య


3.సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా

వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా

నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”