కలవర పడి నే కొండలవైపు

Kalavari Padi Ne

కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా ?(2)
నీవు నాకుండగా – నీవే నా అండగా
నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు

 

1. నీవు నాకుండగా – నీవే నా అండగా ||2||
నీవే నా ||3||
నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు  ||కొండ||

2. సర్వకృపానిధివి – సంపదల ఘనివి ||2||
సకలము ||3||
సకలము – చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద   ||కొండ||

3. నిత్యమూ కదలని – సీయోను కొండపై ||2||
యేసయ్యా ||3||
యేసయ్యా – నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా – కన్నులెత్తుదునా ?  ||కొండ||

నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ

నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ

1. పాపపు ఊబిలో మరణించిన నన్ను – పరమందు చేర్చుటకు

ప్రాణమిచ్చి నన్ను రక్షించినా – ప్రేమను మరువలేను

నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥

2. నన్ను నీ వలె మార్చుటకేగా – ఆత్మతో నింపితివి

ఆత్మతో సత్యముతో ఆరాధించి

ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా (2)

నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా (2)
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2)      ||నా యేసు||

వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా (2)
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2)      ||నా యేసు||

అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే (2)
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2)      ||నా యేసు||

నీ కృప బాహుళ్యమే

నీ కృప బాహుళ్యమే – నా జీవిత ఆధారమే -2
నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥

1. శృతులు లేని – వీణనై మతి – తప్పినా వేళ -2
నీ కృప వీడక – నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥

2. శ్రమలలో – పుటమువేయ బడిన వేళ -2
నీ కృప నాలో – నిత్యజీవ మాయెనా -2 ॥ నీ కృపా ॥

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
తరతరముల నుండి ఉన్నవాడవు
ఆది అంతము లేని ఆత్మా రూపుడా
ఆత్మతో సత్యముతో అరాధింతును
నిత్యుడగు నా తండ్రి

1. భూమి ఆకాశములు గతించినా
మారనే మారని నా యేసయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥

2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
నా పాపములకు పరిహారముగా మారెనులే
కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥

3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను
నూతన సృష్టిగ నేను మారెదను
నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము ॥ నిత్యుడగు ॥