శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2||
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత||

1.సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు ||2||
నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2||
నా నోట మృదువైన మాటలు పలికించినావు ||శాశ్వత||

2.నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2||
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు||శాశ్వత||

స్తుతి గానమే పాడనా

స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2)       ||స్తుతి||

నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2)       ||స్తుతి||

శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2)       ||స్తుతి||

నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2)       ||స్తుతి||