నిత్యుడా – నీ సన్నిధి

నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2

నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2                  ॥ నిత్యుడా ॥

నీ సన్నిధిలో – నా హృదయమును
నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2              ॥ నిత్యుడా ॥

నీ సముఖములో – కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు – నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో – నేరవేర్చుమా -2                       ॥ నిత్యుడా ॥

నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా

నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం -2

నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో -2
దాచియుంచ లేను ప్రభు -2
స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా         ॥ నా ప్రాణ ॥

జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం -2
అర్ధము కాకపొయెనె -2
పతితలేందరో – నీ జీవజలములు త్రాగితిరే – త్రాగితిరే                      ॥ నా ప్రాణ ॥

నాయెడ నీకున్న తలంపులు – బహు విస్తారములై యున్నవి -2
వాటిని వివరించి చెప్పలేనే -2
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి – యున్నవి       ॥ నా ప్రాణ ॥

ఏమని వర్ణింతు – నీ కృపను

ఏమని వర్ణింతు – నీ కృపను – ఏరులై పారెనె – నా గుండెలోన -2

ఏమని వర్ణింతు – నీ కృపను……

1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో – బలము పొందిన వారెవ్వరైనా -2

అలసిపోలేదెన్నడును…. 2 ॥ ఏమని॥

2. పక్షిరాజు వలెను – నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2

నీ కృప నాపై చూపుటకా ….. 2 ॥ ఏమని॥

3. మరణము నశింపచేయుటకేనా – కృపాసత్య సంపూర్ణుడావై -2

మా మధ్యన నివసించితివా ….. 2 ॥ ఏమని॥

మాధుర్యమే నా ప్రభుతో జీవితం

మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే       ||మాధుర్యమే||

సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును – వాడిపోవును       ||మాధుర్యమే||

నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయ భక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు       ||మాధుర్యమే||

నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను – పరిహరించెను       ||మాధుర్యమే||

వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో       ||మాధుర్యమే||

ప్రభువా నీలో జీవించుట

పల్లవి:
ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా||

1. సంగీతములాయె
పెను తుఫానులన్నియు (2)
సమసిపోవునే నీ నామ స్మరణలో (2)
సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా||

2. పాప నియమమును
బహు దూరముగా చేసి (2)
పావన ఆత్మతో పరిపూర్ణమైన (2)
పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా||

3. నీలో దాగినది
కృప సర్వోన్నతముగా (2)
నీలో నిలిచి కృపలనుభవించి (2)
నీతోనే యుగయుగములు నిల్చెద (2) ||ప్రభువా||

4. నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి (2)
నూతనమైన శుభాకాంక్షలతో (2)
నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా||