వందనము నీకే నా వందనము

వందనము నీకే నా వందనము (2)
వర్ణనకందని నీకే నా వందనము (2)      ||వందనము||

నీ ప్రేమ నేనేల మరతు
నీ ప్రేమ వర్ణింతునా (2)
దాని లోతు ఎత్తునే గ్రహించి (2)
నీ ప్రాణ త్యాగమునే తలంచి (2)      ||వందనము||

సర్వ కృపానిధి నీవే
సర్వాధిపతియును నీవే (2)
సంఘానికి శిరస్సు నీవే (2)
నా సంగీత సాహిత్యము నీవే (2)      ||వందనము||

పరిశుద్ధమైన నీ నామం
పరిమళ తైలము వలె (2)
పరము నుండి పోయబడి (2)
పరవశించి నేను పాడెదను (2)      ||వందనము||

మృతి వచ్చెనే ఒకని నుండి
కృప వచ్చెనే నీలో నుండి (2)
కృషి లేక నీ కృప రక్షించెను (2)
కృతజ్ఞతార్పణలర్పింతును (2)      ||వందనము||

తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే (2)
పరిశుద్ధాత్మ దేవునికే (2)
వందన వందన వందనము (2)      ||వందనము||

సర్వోన్నతుడా – హోసన్నా మినిస్ట్రీస్

సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)

నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నా జీవం నీ కృపలో దాచితివే – హోసన్నా మినిస్ట్రీస్

నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం         ||నా జీవం||

పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే (2)
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే (2)       ||నా జీవం||

ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే (2)
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే (2)       ||నా జీవం||

కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే (2)
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే (2)       ||నా జీవం||

వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే (2)
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే (2)       ||నా జీవం||

స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా (2)
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే (2)       ||నా జీవం||

ఓ ప్రభువా… ఓ ప్రభువా…

ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా||

దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

శాశ్వత కృపను నేను తలంచగా

శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత||

నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత||

దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత||

భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత||

సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2)       ||శాశ్వత||

నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2)       ||శాశ్వత||