గగనము చీల్చుకొని

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023


గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని…
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది…           ||గగనము||

1. నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2)         
                                                       ||గగనము||
2. నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2)         
                                                    ||గగనము||
3. నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2)         
                                                  ||గగనము||

 


Gaganamu Cheelchukoni – Ghanulanu Theesukoni | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical in English

Adviteeyuda Album – 2023

 

Gaganamu Cheelchukoni – Ghanulanu Theesukoni
Nannu Konipova Raanaiyunna
Praanapriyudaa Yesayyaa (2)
Ninnu Choodaalani…
Naa Hrudayamentho Ullasinchuchunnadi (2)
Ullasinchuchunnadi…         ||Gaganamu||

Nee Dayaa Sankalpame – Nee Premanu Panchinadi
Nee Chiththame Naalo Neraveruchunnadi (2)
Pavithruraalaina Kanyakagaa
Nee Yeduta Nenu Nilichedanu (2)
Nee Kougililo Nenu Vishraminthunu (2)       ||Gaganamu||

Nee Mahimaishwaryame – Gnaana Sampadanichchinadi
Marmamaiyunna Nee Vale Roopinchuchunnadi (2)
Kalankamu Leni Vadhuvunai
Nireekshanatho Ninnu Cheredanu (2)
Yugayugaalu Neetho Eledanu (2)       ||Gaganamu||

Nee Krupaa Baahulyame – Aishwaryamu Nichchinadi
Thejo Vaasula Swaasthyam Anugrahinchinadi (2)
Akshayamaina Dehamutho – Anaadi Pranaalikatho (2)
Seeyonulo Neetho Nenundunu (2)       ||Gaganamu||

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా | Hosanna ministries 2024 new year  song Lyrics

నిత్యతేజుడా Album – 2024


ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా

ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2)

1. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
|| ప్రేమా పూర్ణుడా ||

2. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
|| ప్రేమా పూర్ణుడా ||

3. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
|| ప్రేమా పూర్ణుడా ||

 


prema purnuda sneha sheeluda | Hosanna ministries 2024 new year  song Lyrics in English

Nityatejudaa Album – 2024

 

Prema Poornudaa Sneha Sheeludaa
Vishwanadhudaa Vijaya Veerudaa
Apathkaala Manduna Sarva Lokamandunna
Deena Janaali Deepamuga Veluguchunnavaadaa…

Aaradhinchu Ninne Loka Rakshakudaa
Aanandinchu Neelo Jeevithaantamu (2)
Nee Krupa Entha Unnathamoo Varninchalenu Swami
Nee Krupa Yandu Thudi Varaku Nadipinchu Yesayya (2)
Naa Thodu Neevunte Anthe Chaalayya
Naa Mundu Neevunte Bhayame Ledaayya (2)

1. Poornamai Sampoorna Maina Nee Divya Chitthame
Neevu Nanu Nadipinche Nootana Maina Jeeva Margamu (2)
Iha Mandu Paramandu Aashrayamainavaaduvu
Innaallu Kshanamaina Nannu Maruvani Yesayya (2)
Naa Thodu Neevunte Anthe Chaalayya
Naa Mundu Neevunte Bhayame Ledaayya (2)
||Prema||

2. Bhagyame Saubhagyame Nee Divya Sannidhi
Bahu Vistaaramaina Nee Krupa Naapai Choopitive (2)
Balamaaina Ghanamaaina Nee Naamamandu Harshinchi
Bhajayinchi Keerthinchi Ghanaparathu Ninnu Yesayya (2)
Naa Thodu Neevunte Anthe Chaalayya
Naa Mundu Neevunte Bhayame Ledaayya (2)
||Prema||

3. Nityamu Prathi Nityamu Nee Jnapakalatho
Naa Antharangamandu Neevu Koluvai Unnavule (2)
Nirmalamaina Nee Manase Naakankitham Chesavu
Neetone Jeevimpa Nannu Konipo Yesayya (2)
Naa Thodu Neevunte Anthe Chaalayya
Naa Mundu Neevunte Bhayame Ledaayya (2)
||Prema||