నా ప్రార్థనలన్ని ఆలకించినావు

నా ప్రార్థనలన్ని ఆలకించినావు

నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము

నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను

నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు ||2|| || నా ప్రార్థనలన్ని ||

1. అడిగినంతకంటె అధికముగా చేయు

ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా ||2||

పరిపూర్ణమైన నీ దైవత్వమంతా

పరిశుద్ధతకే శుభ ఆనవాలు ||2|| || నా ప్రార్థనలన్ని ||

2. ఆపత్కాలములో మొరపెట్టగానే

సమీపమైతివే నా యేసయ్యా ||2||

సమీప భాందవ్యములన్నిటికన్నా

మిన్నయైనది నీ స్నేహబంధము ||2|| || నా ప్రార్థనలన్ని ||

3. ఎక్కలేనంత ఎత్తైన కొండపై

ఎక్కించుము నన్ను నా యేసయ్యా ||2||

ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు

ఆత్మీయతకే స్థిరపునాదులు ||2|| || నా ప్రార్థనలన్ని ||

నా జీవితాన కురిసెనే

నా జీవితాన కురిసెనే

నీ కృపామృతం

నా జిహ్వకు మధురాతి మధురం

నీ నామగానామృతం ||2||

నీ కృపతోనే అనుక్షణం

తృప్తి పొందెదను ||2||

1. నీ దయ నుండి దూరము కాగా

ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2||

కృపయే నాకు ప్రాకారము గల

ఆశ్రయపురమాయెను

నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను   ||2||      || నా జీవితాన ||

2. నా యేసయ్యా – నీ నామమెంతో

ఘనమైనది – కొనియాడదగినది ||2||

కృపయేనా ఆత్మీయ అక్కరలు

సమృద్ధిగా తీర్చెను

నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది   ||2||      || నా జీవితాన ||

3. నీ సన్నిధిని నివసించు నాకు

 అపాయము దరిచేరనివ్వవు ||2||

కృపయేనా అడుగులు స్థిరపరచి

బండపై నిలిపెను

నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను   ||2||      || నా జీవితాన ||