పరుగెత్తెదా పరుగెత్తెదా

పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)
అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)
అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)
వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

ఎవరూ సమీపించలేని

ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)

ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2)         ||ఏమౌదునో||

పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)         ||ఏమౌదునో||

జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2)         ||ఏమౌదునో||