అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)

ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2)         ||అత్యున్నత||

పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2)           ||అత్యున్నత||

పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2)      ||అత్యున్నత||

సీయోనులో స్తిరమైన పునాది నీవు

సీయోనులో స్తిరమైన పునాది నీవు 
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు 

సూర్యుడు లేని - చంద్రుడు లేని 
చీకటి రాత్రులు - లేనే లేని 
ఆ దివ్య నగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా   || సీయోనులో || 

కడలిలేని - కడగండ్లులేని 
కల్లోల స్థితిగతులు - దరికే రాని 
సువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా          || సీయోనులో ||
 
కలతలు లేని - కన్నీరు లేని 
ఆకలి దప్పులు - అసలే లేని 
నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా - నా యేసయ్యా  || సీయోనులో ||
 
సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము 
సౌందర్య సీయోనులో - నీ మనోహరమైన ముఖము దర్శింతును 
నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే               || సీయోనులో ||