రాజుల రాజుల రాజు

రాజుల రాజుల రాజు

సీయోను రారాజు    ||2||

సీయోను రారాజు నా యేసు

పైనున్న యెరూషలేము నా గృహము    ||2||


1.తల్లి గర్భము నుండి వేరు చేసి

తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి    ||2||

సీయోను కొరకే నన్ను ఏర్పరచిన

సీయోను రారాజు నా యేసు    ||2|||| రాజుల ||


2.నిషేధించబడిన రాయి

సీయోనులో మూల రాయి    ||2||

ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన

సీయోను రారాజు నా యేసు    ||2||

హల్లెలూయా ప్రభు యేసుకే

పల్లవి ||  హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను హల్లెలూయా

 

1. ఆనంద మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి

సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే

 

2. ఆనంద మానంద మానందమే ఆనందతైలంతో అభిషేకించి

అతిపరిశుద్ధ స్థలప్రవేశమిచ్చె నా జీవిత భాగ్యమే

 

3. ఆనంద మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే

తండ్రి కుడిపార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే